Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు బంధించే క్రమంలో పులి మృతి

శ్రీజ రెడ్డి Jul 15, 2026 8:50 AM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago
అధికారులు బంధించే క్రమంలో పులి మృతి - Udayam Digital
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో తాడోబా అభయారణ్యం పరిధిలో టి-202 అనే ఆడ పులి మృతి చెందింది. ఓ వ్యక్తిని హతమార్చిన ఈ పులిని బంధించేందుకు అధికారులు మత్తుమందు ప్రయోగించగా అది ప్రాణాలు కోల్పోయింది. గతంలో బంధించి కోర్ జోన్‌లో వదిలినప్పటికీ ఎలాంటి ఆహారం తీసుకోకుండా మళ్లీ గ్రామాల వైపు రావడంతో ఈ చర్యలు చేపట్టారు. శవపరీక్ష తర్వాత మృతికి గల కారణాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...