Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబా, ఫరా కవలల నరకయాతన

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 15, 2026 9:43 AM జాతీయంGeneral
సబా, ఫరా కవలల నరకయాతన - Udayam
బిహార్‌ పట్నాకు చెందిన 23 ఏళ్ల అవిభాజ్య కవల సోదరీమణులు సబా, ఫరా తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. 'క్రేనియోపేగస్' రుగ్మతతో తలలు అతుక్కుని పుట్టిన వీరికి, గత మూడు నెలలుగా సరైన మందులు అందక నరకం అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పట్నా సివిల్ సర్జన్ కార్యాలయం ద్వారా వీరికి అందాల్సిన ఆరు రకాల అత్యవసర మందుల సరఫరా ప్రస్తుతం నిలిచిపోయింది. మందులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...