వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సేవాదాస్‌నగర్ చర్చి సమీపంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను శనివారం సాయంత్రం స్థానిక తహసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందన్నారు.
పేకాట, మద్యపానం వల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. పేకాట, మద్యపానానికి ప్రజలు దూరంగా ఉండాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

