వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేటలో చెంగాళమ్మ ఆర్చ్ సమీపంలోని జాతీయ రహదారిపై తహసీల్దార్ గోపాలకృష్ణ కారు ప్రమాదానికి గురైంది. మలుపు తిరుగుతుండగా నాయుడుపేట నుంచి చెన్నై వెళ్తున్న ఐషర్ వాహనం కారును ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో కారులో గోపాలకృష్ణ ఒక్కరే ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు ముందు చక్రం విరిగిపోగా స్వల్ప నష్టం జరిగింది. ఐషర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక సమాచారం.
Comments
Loading comments...

