Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచ్‌లో ముగ్గురు యువకులు గల్లంతు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 20, 2026 9:02 AM తూర్పుగోదావరి General
బీచ్‌లో ముగ్గురు యువకులు గల్లంతు - Udayam
అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో పెళ్లి బృందానికి చెందిన ముగ్గురు యువకులు కెరటాల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరిలో అరవింద్, షణ్ముఖ్‌ల మృతదేహాలు తీరానికి చేరగా, సత్యభాస్కర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. కుమార్తె వివాహం తర్వాత నవదంపతులు, బంధువులు కలిసి బీచ్‌కు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మత్స్యకారుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...