వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

తూర్పుగోదావరి జిల్లా నరసాపురం వద్ద ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాదరాడ నుంచి కోరుకొండ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులను గాదరాడకు చెందిన అంజన్న, వీర దుర్గా, నాగులుగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...