Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వియత్నాం పడవ ప్రమాదం పై చంద్రబాబు ఆరా

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 12, 2026 7:21 PM అమరావతిGeneral
వియత్నాం పడవ ప్రమాదం పై చంద్రబాబు ఆరా - Udayam
వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. మృతదేహాల తరలింపునకు వేగంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లె కిశోర్ కోలుకుంటున్నారని, మృతదేహాలను వెనక్కి తెచ్చేందుకు ఎంబసీ ద్వారా ఏజెన్సీని నియమించామని అధికారులు తెలిపారు. సురక్షితంగా ఉన్న పర్యాటకులను నేడు విమానాల్లో స్వస్థలాలకు చేర్చనున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, ఈ ప్రక్రియ పూర్తయ్యేదాకా భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఏపీ భవన్ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...