Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ.. పని మనిషి అరెస్ట్‌

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 04, 2026 11:50 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ.. పని మనిషి అరెస్ట్‌ - Udayam
వృద్ధ దంపతుల ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో పని మనిషిని పోలీసులు అరెస్ట్‌ చేసి 9 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లెందులో జరిగిన ఈ ఘటన వివరాలను డీఎస్పీ వెంకన్నబాబు వెల్లడించారు. నాలుగు నెలలుగా పని మనిషిగా ఉన్న షీబా రాణి చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...