వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. మాస్కులు ధరించిన దుండగులు అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.
ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

