Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:06 PM ఆదిలాబాద్General
విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు - Udayam
ఇచ్చోడ ఎంజేపీలో ఫైన్‌, ఫేర్‌వెల్‌ పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని టీజీవీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల నుంచి రూ.23 వేలకు పైగా ఫైన్‌ వసూలు చేశారని తెలిపారు. ఫేర్‌వెల్‌ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1,000 తీసుకున్నారని ఆరోపించారు. వసూలు చేసిన మొత్తంతో సీసీ కెమెరాలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...