Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఉద్రిక్తత

సంజయ్ రెడ్డి Jul 23, 2026 7:53 PM విజయవాడabout 1 hour ago
విజయవాడలో ఉద్రిక్తత - Udayam Digital
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ చేస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు లోక్‌భవన్‌ ముట్టడికి భారీగా ప్రయత్నించాయి. ఈ ఆందోళనను పోలీసులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వలయాలను ఛేదించేందుకు విద్యార్థులు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Comments

G
Loading comments...