Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 23, 2026 12:48 PM హైదరాబాద్General
నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత - Udayam
గాంధీభవన్ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంతో నాంపల్లి ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతల నడుమ అట్టుడికిపోయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ చౌరస్తా వద్ద బారికేడ్లు వేసి అడ్డుకున్న పోలీసులతో భాజపా నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించివేసేందుకు యత్నించిన భాజపా నేతలను, యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ ఠాణాకు తరలించారు.

Comments

G
Loading comments...