Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివ్వంపేట ఆలయాల్లో చోరీ.. హుండీలు ధ్వంసం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 31, 2026 2:58 PM మెదక్General
శివ్వంపేట ఆలయాల్లో చోరీ.. హుండీలు ధ్వంసం - Udayam
మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులోని శ్రీగురు పీఠం ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. శ్రీ దత్తాత్రేయ మహాస్వామి, షిర్డీ సాయిబాబా ఆలయాల హుండీలను పగులగొట్టి నగదు అపహరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...