వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఆరు వేలకు పైగా దేవాలయాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.813 కోట్లు కేటాయించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాల రక్షణకు తమ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని సోమవారం వెల్లడించారు.
గ్రామీణ ప్రజల కోరిక మేరకు ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ధార్మిక పరిషత్, శ్రీవాణి నిధులతో ఇప్పటికే 1,200కు పైగా భజన మందిరాలను పూర్తి చేశామని మంత్రి వివరించారు.
Comments
Loading comments...

