Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో కుంభాభిషేక ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Suresh Jun 22, 2026 4:14 PM అనంతపురంGeneral
ధర్మవరంలో కుంభాభిషేక ఏర్పాట్ల పరిశీలన - Udayam
ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 24న జరగనున్న మహా శాంతిస్థాపన, కుంభాభిషేక ఏర్పాట్లను బీజేపీ నేత హరీష్ బాబు, ఆలయ చైర్మన్ జగదీష్ సోమవారం పర్యవేక్షించారు. వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హరీష్ బాబు సూచించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...