వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పోలీసులకు సోమవారం గ్రావిటా కంపెనీ ఏజీఎం మురళీ అత్యాధునిక డ్రోన్‌ను వితరణగా అందించారు. ఎస్పీ తుషార్ డూడీ దీనిని స్వీకరించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా ప్రజా భద్రతను పటిష్టం చేయడానికి ఈ సాంకేతికత ఎంతో కీలకం కానుంది.
ఈ డ్రోన్ నిఘా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందించి సహకరించిన కంపెనీ ప్రతినిధులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

