వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల వినతులను అధికారులు తమ సొంత సమస్యలుగా భావించి త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె. హేమలత ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గృహ నిర్మాణం, ఆరోగ్య శాఖా నియామకాలు, భూ రీసర్వే, పాస్ పుస్తకాలు మరియు పిఎం కిసాన్ వంటి అంశాలపై వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు.
ప్రతి దరఖాస్తును చట్ట పరిధిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

