వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రొ. మల్లం నవీన్ అధ్యక్షత వహించారు. తెలంగాణ భాష ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమన్నారు.
కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని తెలుగు విభాగాధిపతి ఎస్. రజిత తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

