వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లాపూర్ – విద్యుత్‌నగర్ మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ 21 కోట్లు మంజూరు చేసినట్లు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. శనివారం రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పనుల ప్రాంతాన్ని పరిశీలించారు.
25 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

