వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత, విద్యార్థుల నమోదును పెంచాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ డీఈఓలను ఆదేశించారు. బడుల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు, మౌలిక వసతులు, అకాడమిక్ ప్యానెల్ తనిఖీలు పూర్తి చేయాలన్నారు.
ప్రాథమిక అక్షరాస్యత (FLN), ప్రీ-ప్రైమరీ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సాయంతో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ.. పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనం సకాలంలో అందించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

