Back to feed
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
Ravi Shukla May 29, 2026 12:14 PM హైదరాబాద్ 17 views1 day ago

తెలంగాణ ఈసెట్ (TS ECET) ఫలితాలు శుక్రవారం (మే 29) విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్ణ రెడ్డి ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం 93.60 శాతం మంది (16,726 మంది అభ్యర్థులు) ఉత్తీర్ణత సాధించారు.
త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని, జూలై మొదటి వారం నుండి తరగతులు ప్రారంభమవుతాయని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ. కుమార్ మొలుగారం, ఈసెట్ కన్వీనర్ ప్రొ. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...


