Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ బంద్‌కు సిద్ధం!

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 06, 2026 12:23 PM హైదరాబాద్General
తెలంగాణ బంద్‌కు సిద్ధం! - Udayam
పోలీస్ శాఖలో 7,437 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌పై నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. కనీసం 20 వేల పోస్టులతో మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త బంద్‌కు నిరుద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. అన్ని సంఘాలను ఏకం చేసే దిశగా జేఏసీ ప్రయత్నాలు చేస్తోంది. బంద్‌కు ముందు నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...