Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మినేని సీతారాం కుటుంబంపై భూకబ్జా కేసు

శ్రుతి రెడ్డి Jul 19, 2026 7:00 PM శ్రీకాకుళంabout 16 hours ago
తమ్మినేని సీతారాం కుటుంబంపై భూకబ్జా కేసు - Udayam Digital
శ్రీకాకుళంలో విలువైన భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన వ్యవహారంలో వైకాపా నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణితో సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించామని, పరారీలో ఉన్న తమ్మినేని దంపతులతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...