వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి మండలం గౌరిపట్నంకు చెందిన ఆరేళ్ల బాలుడు కార్తికేయ పరుగు పందెంలో పతకం సాధించి ప్రశంసలు అందుకున్నాడు. విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన న్యూ ఇండియా ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొని ప్రతిభ చాటాడు.
చిన్న వయసులోనే పతకం సాధించడంపై తల్లిదండ్రులు రాజశేఖర్, హారిక గర్వం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, స్థానికులు కార్తికేయను అభినందించారు.
Comments
Loading comments...

