వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ పరిధిలోని యాతాల వంక-బోడెవారిపల్లె రోడ్డుకు కంకర పరిచి తారు వేయకుండా వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రహదారి గుంతలు, కంకర రాళ్లతో అధ్వానంగా మారింది.
ఈ మార్గంలో బైకులపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి త్వరగా తారు రోడ్డు వేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

