Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 6:56 PM వికారాబాద్General
తాండూరులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి - Udayam
తాండూరులో బీసీ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పాపన్న చేసిన పోరాటం ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, అనిత, పాండు గౌడ్, కేవీపీఎస్ నేత మల్కయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...