వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్ పేట మండలం చిన్నమెగ్యానాయక్ తండాలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన సంతోష్ నాయక్ ఇంటి తాళాలు, బీరువా పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. బంగారం, వెండి ఆభరణాలు, నగదు, టీవీ, వాషింగ్ మిషన్, గ్యాస్ సిలిండర్ చోరీకి గురయ్యాయి.
మొత్తం విలువ సుమారు రూ.7 లక్షలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.
Comments
Loading comments...

