వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణం జంగాల కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గత నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నామన్నారు.
మహిళలు రోడ్డుపై ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

