Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో స్వైన్‌ఫ్లూ వ్యాప్తి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 23, 2026 2:26 PM జాతీయంGeneral
మహారాష్ట్రలో స్వైన్‌ఫ్లూ వ్యాప్తి - Udayam
నాగపూర్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. జూలై నెలలోనే 15 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించినట్లు నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ) వెల్లడించింది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారిపై ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...