వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరునగరపాలక పరిధిలో శనివారం “స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. కట్టమంచిలో కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, ఎంహెచ్‌ఓ డా. అనిల్ కుమార్ పాల్గొని మేజర్ డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించారు.
తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కాలువల్లో చెత్త వేయవద్దని కమిషనర్ ప్రజలకు సూచించారు. అన్ని వార్డుల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Loading comments...

