Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య సమరయోధుడు ఏటుకూరి కన్నుమూత

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 9:10 AM గుంటూరువాణిజ్యం
స్వాతంత్ర్య సమరయోధుడు ఏటుకూరి కన్నుమూత - Udayam
గుంటూరు జిల్లా ఏటుకూరుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ కమ్యూ నిస్టు నేత ఏటుకూరి కృష్ణమూర్తి (104) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బ్రిటిష్ పాలనలో రాయల్ నేవీలో పనిచేస్తూనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. రెవెన్యూ శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందారు. శతాధిక వృద్ధుడైన ఆయనకు నేడు హైదరాబాద్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...