వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ లైఫ్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా మదనపల్లె-2 డిపోలో సుస్థిర ఆహార విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి న్యూరో సర్జన్ డాక్టర్ మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమతుల్య పోషకాహారం, మంచి ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు. ఆహారాన్ని వృథా చేయకుండా చిరుధాన్యాలు, సంప్రదాయ ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

