Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయంపై చికిత్స పొందుతూ మృతి

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:48 PM అంతర్జాతీయంGeneral
విమానాశ్రయంపై చికిత్స పొందుతూ మృతి  - Udayam
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబర్‌ 10న హూతీలు జరిపిన దాడిలో గాయపడిన మరో భారతీయుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయాన్ని సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ఈ దాడిలో గతంలో హైదరాబాద్‌ మెహదీపట్నంకు చెందిన మహమ్మద్‌ యూసఫ్‌ అలీ మృతిచెందారు.

Comments

G
Loading comments...