వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ అశోక్ (33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆసుపత్రి భవనం మూడో అంతస్తు నుంచి కిందపడగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు.
ప్రమాదవశాత్తు పడిపోయాడా లేదా ఎవరైనా తోసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

