Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్గల్‌లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 5:12 PM సిద్దిపేటGeneral
వర్గల్‌లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - Udayam
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గుంటిపల్లికి చెందిన బొడిగె వీరాగౌడ్‌(38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గౌరారం ఏఎస్సై పోచాగౌడ్‌ తెలిపారు. ఈనెల 16న ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా 17న ఉదయం వర్గల్‌లోని ఆయన షాప్‌లో మృతదేహం కనిపించింది. మృతికి ముందు వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. భార్య మానస ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...