వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మండలంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగి వేపచెట్టు మాధయ్య(70) హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఇంటి ఆవరణలో స్నానం చేస్తుండగా బండరాయితో దాడి చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో మృతుడి కుమారుడు బాపురావుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

