Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేవలం దూషణలు అశ్లీలత కాదు: సుప్రీం

రాజిత దేవి Jul 20, 2026 6:43 AM అల్ ఇండియా about 20 hours ago
కేవలం దూషణలు అశ్లీలత కాదు: సుప్రీం - Udayam Digital
కేవలం అమర్యాదకరమైన దూషణలు, శాపనార్థాలు అశ్లీలత కిందికి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన భూవివాదం కేసుపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. లైంగిక విషయాలపై ఆసక్తి రేకెత్తించేలా, మనసుల్ని కలుషితం చేసేలా ఉండే చేష్టలనే అశ్లీలంగా పరిగణించాలని కోర్టు తెలిపింది. ఈ కేసులోని ఆరోపణలు బహిరంగ ప్రదేశంలో జరగలేదని, కావున వీటిని అశ్లీలతగా పేర్కొనలేమని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...