Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల విద్యా హక్కుపై సుప్రీం కీలక తీర్పు

Follow Udayam on Google
Sonia Singh May 26, 2026 4:43 PM జాతీయంGeneral
బాలికల విద్యా హక్కుపై సుప్రీం కీలక తీర్పు - Udayam
పాఠశాలల్లో టాయిలెట్లు, శానిటరీ న్యాప్‌కిన్స్ లేని కారణంగా బాలికలు చదువు మానేయకుండా చూడాలని సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని విద్యాసంస్థల్లో బాలికలకు ప్రత్యేక సౌకర్యాల కొరతపై జస్టిస్ బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని బెంచ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆడపిల్లల కోసం విడిగా టాయిలెట్లు నిర్మించాలని, బయోడీగ్రేడబుల్ శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ వసతులు లేకపోవడం వల్లే చాలా మంది చదువుకు దూరమవుతున్నారని, ప్రభుత్వాలు ఈ ఆదేశాలను బాధ్యతగా అమలు చేయాలని సూచించింది.

Comments

G
Loading comments...