వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. శనివారం గ్రేటర్ పరిధిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గాలిలో తేమ శాతం 36గా ఉంది.
సాధారణ స్థాయి కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో ఎండ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు ఊరటనిచ్చారు.
Comments
Loading comments...

