Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుహాస్ ‘మండాడి’ విడుదల తేదీ ఖరారు

Follow Udayam on Google
Siddharth Varadarajan Jun 13, 2026 11:48 AM జాతీయంవినోదం
సుహాస్ ‘మండాడి’ విడుదల తేదీ ఖరారు - Udayam
తెలుగు యువ నటుడు సుహాస్ విలన్‌గా కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మండాడి’ విడుదల తేదీ ఖరారైంది. తమిళ్ స్టార్ కమెడియన్ సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ కోస్టల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం రూ.80 కోట్ల వ్యయంతో మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...