వార్తలకు తిరిగి వెళ్లండి
అవమానంతో విద్యార్థిని బలి

పుప్పాలగూడ సెక్రెటేరియట్ కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థిని శ్రేయ(20) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఆమె, అధ్యాపకులు అవమానించారనే ఆవేదనతో ఈ ఘోరానికి ఒడిగట్టింది.
సోమవారం రాత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆమె, తెల్లవారుజామున శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...