Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో విద్యార్థుల రాస్తారోకో

Follow Udayam on Google
రాజిత దేవి Jul 20, 2026 1:26 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో విద్యార్థుల రాస్తారోకో - Udayam
రాజంపేట్-కామారెడ్డి మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులు తమ గ్రామాల వద్ద నిలపడం లేదని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా లింగయ్యపల్లి, కోటలపల్లి గ్రామాల విద్యార్థులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాల వేళల్లో బస్సులు ఆపకపోవడంతో సమయానికి పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ పాస్‌లు తీసుకున్నా బస్సులు ఆపకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, అధికారులు స్పందించి ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...