Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

Follow Udayam on Google
రచన దేవి Jul 19, 2026 7:39 PM హైదరాబాద్క్రైమ్
పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య - Udayam
హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్యానీ షా టేక్రీ దర్గా సమీపంలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఫైజ్ మహ్మద్ (అజాన్)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో తీవ్ర కత్తిపోట్లకు గురైన ఫైజ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న కాలాపత్తర్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...