వార్తలకు తిరిగి వెళ్లండి
చెన్నూరు గురుకులంలో విద్యార్థి అదృశ్యం

మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి దుర్గం హర్ష గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. పాఠశాల సిబ్బంది గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...