Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా గాయకుడు నాగన్న కన్నుమూత

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 03, 2026 4:25 PM హైదరాబాద్General
ప్రజా గాయకుడు నాగన్న కన్నుమూత - Udayam
ప్రముఖ విప్లవ గీతాల గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు అరుణోదయ నాగన్న (65) అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రాజారానికి చెందిన ఆయన తన గళంతో ఎన్నో ప్రజా పోరాటాలకు, ఉద్యమాలకు ఊపిరి పోశారు. విప్లవ భావాలను సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నాగన్న మరణం ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...