వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదయ్య పార్టీకి తగిన గౌరవం ఇవ్వడం లేదని, అసలైన కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ గాంధీ భవన్ ఎదుట 'కాలె యాదయ్య హఠావో' అంటూ ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే తీరుపై నిరసన తెలిపిన కార్యకర్తలు, ఆయన చెర నుండి పార్టీని కాపాడాలని డిమాండ్ చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

