Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగోటం స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 18, 2026 8:31 AM హైదరాబాద్General
లింగోటం స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ - Udayam
చౌటుప్పల్ మండలం లింగోటం జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులే స్వయంగా పాఠశాల బాధ్యతలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 18 మందితో స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుని పచ్చదనం, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ చూసుకుంటున్నారు. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో మూడేళ్లలోనే విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. దాతల సహకారం కూడా తోడవడంతో పాఠశాల అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.

Comments

G
Loading comments...