వార్తలకు తిరిగి వెళ్లండి
బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత

శంషాబాద్ పరిధిలోని బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు స్థలానికి కంచె వేసేందుకు వచ్చిన హైడ్రా, రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.
పోలీసులతో జరిగిన తోపులాటలో ఓ రైతు స్పృహతప్పి పడిపోయారు. తమకు పూర్తి న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు అక్కడ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
Comments
Loading comments...