Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ బడిలో ఇద్దరే విద్యార్థులు

హరిక శర్మ Jul 18, 2026 8:57 AM నల్గొండabout 1 hour ago
ఆ బడిలో ఇద్దరే విద్యార్థులు - Udayam Digital
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం మధురానగర్‌ కాలనీ ప్రభుత్వ పాఠశాల కేవలం ఇద్దరు విద్యార్థులతో నడుస్తోంది. 2023లో విద్యార్థులు లేక మూతపడిన ఈ స్కూల్‌ను, ప్రతి ఆవాస ప్రాంతంలో బడి ఉండాలన్న సీఎం ఆదేశాలతో ఈ విద్యాసంవత్సరం మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం ఒకటో తరగతి, రెండో తరగతి చదువుతున్న ఆ ఇద్దరు పిల్లల కోసం ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడిని, ఒక వంట మనిషిని కేటాయించి సకల వసతులను కల్పించింది.

Comments

G
Loading comments...