Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ప్రయాణికులే దొంగల లక్ష్యం

కౌశిక్ శర్మ Jul 18, 2026 9:00 AM నల్గొండabout 1 hour ago
బస్సు ప్రయాణికులే దొంగల లక్ష్యం - Udayam Digital
రెండు తెలుగు రాష్ట్రాల్లోని బస్‌స్టేషన్లలో ప్రయాణికులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను దేవరకొండ పోలీసులు పట్టుకున్నారు. బస్సెక్కే హడావుడిలో ఉన్న ప్రయాణికుల బ్యాగులను కట్ చేసి, వీరు సొమ్మును మాయం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెల 1న ఓ మహిళ నుంచి రూ.2 లక్షలు దొంగిలించిన కేసులో విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...